బాహుబలి గురించి కొత్త సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. తెలుగులో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. దాదాపు రూ. వంద కోట్లు ఖర్చుపెడతున్నారట. ఆ బడ్జెట్ దాటే అవకాశాలున్నాయి. ఎందుకంటే… ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్స్ చేరుతున్నాయి. ఇందులో ప్రభాస్ ఒక్కడు కాదు. ఇద్దరు. ఔను… ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడు. అంతే కాదు.. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తారట. ఒక భాగం అయితే చెప్పాల్సిన కథ పూర్తిగా చెప్పడం కుదరదని రాజమౌళి అభిప్రాయం. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేసే విషయంపై తీవ్ర మంతనాలు జరుగుతున్నాయి. ఒకవేళ బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2లుగా వస్తే… ఈ సినిమా బడ్జెట్ రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే బాలీవుడ్ బడ్జెట్‌కు మించిపోతుంది తెలుగు సినిమా.