“అమ్మ హస్తాని”కి సరుకుల్లేవన్న ఆయన తన నియోజకవర్గంలో ఇప్పటి వరకూ.. ఒక్క సంచీ పంపిణీ జరగలేదని తెలిపారు. ఇందిరమ్మ కలలు పధకం చాలా మంచిది, కానీ చట్టం చేసిన తరువాత దళితులకు ఏంచేసారని ముఖ్యమంత్రిని సూటిగా అడిగారు. దామోదర రాజనర్సింహ సబ్ ప్లాన్ కోసం ఆలోచిస్తే దళితుడు కనుక డిప్యూటీ సీఎంను ప్రక్కన పెట్టి సీఎం యాడ్లలో ఊరేగుతున్నాడు అని ధ్వజమెత్తారు.
“బంగారు తల్లి పధకం” ఇంకా అమలుకు నోచుకోక ముందే.. దానికి తీవ్ర ప్రచారం చేస్తున్నారని కానీ దాని అమలు దేవుడికే తెలియాలని ఆయన అన్నారు. అలాగే, వడ్డీలేని రుణం(ఇందిరా క్రాంతి), ఇందిర జల ప్రభ , రాజీవ్ విద్యా జీవనం, ప్రభుత్వ ఉద్యోగ జాతర ఇలా పేరుకు మాత్రం పథకాలెన్నో.. అమలు మాత్రం శూన్యంగా ఉందని, ప్రభుత్వ పధకాల అమలుకు కనీసం వాటి పబ్లిసిటీకైన ఖర్చు కూడా పెట్టడంలేదని ఆక్షేపించారు.