రాజీనామా చేయనన్నానా…?

dl ravindra reddyప్రభుత్వ తీరుపై మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయబడిన మాజీ మంత్రి డీల్ డీఎల్ రవీంద్రారెడ్డి విరుచుకు పడ్డారు. పార్టీ నియమావళి ఉల్లంఘించను, కానీ పార్టీని ముంచేస్తే చూస్తూ ఊరుకోనని ఆయన అన్నారు. సీఎల్పీ సమావేశ కార్యాలయానికి తాళం వేయడంతో.. బయటే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. నేరుగా సీఎంకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రజాస్వామ్య భారత దేశంలో దురదృష్టకరమైన రీతిలో తనను తొలగించారని ఆవేదనవ్యక్తం చేశారు. నేనమయినా.. రాజీనామా చేయనన్నానా? లేదా నెనేమైన కళంకిత మంత్రుడినా..? అనిప్రశ్నించారు. అయితే దీనిపై తానెవరికీ ఫిర్యాదు చేయనని డీఎల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పధకాలపై ఆయన తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కొక్క పథకాని సవివరంగా వివరిస్తూ.. ఏకిపారేశారు.

“అమ్మ హస్తాని”కి సరుకుల్లేవన్న ఆయన తన నియోజకవర్గంలో ఇప్పటి వరకూ.. ఒక్క సంచీ పంపిణీ జరగలేదని తెలిపారు. ఇందిరమ్మ కలలు పధకం చాలా మంచిది, కానీ చట్టం చేసిన తరువాత దళితులకు ఏంచేసారని ముఖ్యమంత్రిని సూటిగా అడిగారు. దామోదర రాజనర్సింహ సబ్ ప్లాన్ కోసం ఆలోచిస్తే దళితుడు కనుక డిప్యూటీ సీఎంను ప్రక్కన పెట్టి సీఎం యాడ్లలో ఊరేగుతున్నాడు అని ధ్వజమెత్తారు.

“బంగారు తల్లి పధకం” ఇంకా అమలుకు నోచుకోక ముందే.. దానికి తీవ్ర ప్రచారం చేస్తున్నారని కానీ దాని అమలు దేవుడికే తెలియాలని ఆయన అన్నారు. అలాగే, వడ్డీలేని రుణం(ఇందిరా క్రాంతి), ఇందిర జల ప్రభ , రాజీవ్ విద్యా జీవనం, ప్రభుత్వ ఉద్యోగ జాతర ఇలా పేరుకు మాత్రం పథకాలెన్నో.. అమలు మాత్రం శూన్యంగా ఉందని, ప్రభుత్వ పధకాల అమలుకు కనీసం వాటి పబ్లిసిటీకైన ఖర్చు కూడా పెట్టడంలేదని ఆక్షేపించారు.