బ‌లుపు బ‌ల్క్‌గా కొనేశాడు!

Dil Raju takes Balupu Nizam rightsర‌వితేజ సినిమాకి మంచి రోజులొచ్చిన‌ట్టే క‌నిపిస్తున్నాయి. మొన్న శ్రుతిహాస‌న్ త‌న హాట్ హాట్ భంగిమ‌ల‌తో కాస్త స్పైసీ జోడించింది. త‌మ‌న్ త‌న ద‌రువుల‌తో జోరు తెచ్చాడు. ల‌క్ష్మీరాయ్ ఐటెమ్ సాంగ్‌తో – ఇంకాస్త మెరుపొచ్చింది. ఇప్పుడు దిల్‌రాజుతో ఈ సినిమాకి క్రేజ్ వచ్చింది. ఆయ‌నేం చేశాడంటారా…? ఈ సినిమా నైజాం రైట్స్ బ‌ల్క్‌గా కొనేశారు. దిల్‌రాజు చూపు ఓ సినిమాపై ప‌డిందంటే – త‌ప్పకుండా ఏదో విష‌యం ఉండే ఉంటుంది. దాంతో బ‌లుపు సినిమాకి స‌రికొత్త క్రేజ్ వ‌చ్చింది. మిగిలిన ఏరియాల‌నుంచీ మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కూ ఏ హ‌డావుడి లేని బ‌లుపు.. ఒక్కసారిగా త‌న బ‌లుపు చూపించ‌డం మొద‌లెట్టింది. ఈ సినిమాకి ఇది శుభ‌శ‌కున‌మే.