దసరా నుండి తెలంగాణ పాఠశాల్లో డిజిటల్ పాఠాలు..

dijitel-schoolsతెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు తీపి కబురు తెలియజేసింది. ఇక మీ తరగతి గదిలలో డిజిటల్ పాఠాలు వినిపించనున్నాయి. దసరా నుండి ఆరువేల ఉన్నత పాఠశాలల్లో ఈ డిజిటల్ పాఠాలు చెప్పబోతున్నారు. 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు ఈ తరగతులు చెప్పబోతునట్లు ప్రకటించారు. పదో తరగతి విద్యార్థులకు మినహాయింపు ఇచ్చారు. డిజిటల్ కార్యక్రమం ద్వారా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని సర్కార్ భావిస్తుంది.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు ,మోడల్ స్కూళ్లు, అన్ని సంక్షేమ పాఠశాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ల్లో డిజిటల్ పాఠాలు చెప్పబోతున్నారు. భవిష్యత్‌లో అందరికీ కంప్యూటర్ పాఠాలు కూడా చెప్పాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.