Site icon TeluguMirchi.com

దేశంలోనే ప్రథమంగా తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో డయాలసిస్‌

కిడ్నీలు చెడిపోయిన వారు ప్రతి వారం వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో డయాలసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. పేద వారికి డయాలసిస్‌ అనేది సాధ్యం అయ్యేది కాదు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్‌ యూనిట్‌లను ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 269 డయాలసిస్‌ యూనిట్లను 39 గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లో ప్రవేశ పెట్టినట్లుగా తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. దేశంలోనే ఇంత భారీ స్థాయిలో ఒక రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభించడం మొదటి సారిగా చెబుతున్నారు. రాష్ట్రంలో ముఖ్య నగరాలు మరియు పట్టణాల్లో డయాలసిస్‌ సింగిల్‌ యూజ్‌ యూనిట్లను ఏర్పాటు చేసినట్లుగా ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని పేద ప్రజలకు మెరుగైన వైధ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే డయాలసిస్‌ యూనిట్లను ప్రారంభించినట్లుగా మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని డయాలసిస్‌ యూనిట్లను కూడా ప్రారంభించబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు.

Exit mobile version