బెంగాల్ వద్ద తీరం దాటిన వాయుగుండం

bengal-coastబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బెంగాల్ వద్ద తీరం దాటింది. వాయుగుండం కారణంగా గత రెండు రోజుల నుంచీ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24
గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మృత్స్యుకారులకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు.