మళ్ళీ మూగబోయిన డమరుకం

డమరుకం రిలీజ్‌ విషయంలో తెలుగుమిర్చి అనుమానం నిజమైంది. డమరుకం సినిమా రిలీజ్‌ తేదీల వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న రిలీజ్‌ కావలసిన డమరుకం నేటికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నేడు కూడా రిలీజ్‌ కావడం లేదని తెలిసింది. వివరాలు తెలియచేయడానికి చిత్రనిర్మాతలు కాని, డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరూ అందుబాటులో లేరు. డమరుకం తరువాతి వాయిదా తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. నాగార్జున సినీ కెరియర్‌ లో ఒక సినిమా రిలీజ్‌ కు ఇన్ని ఆటంకాలు రావడం ఇదే మొదటిసారి. ఈ విషయమై నాగార్జున అభిమానులు చిత్ర  నిర్మాతపై చాలా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.