కనీసం 23నైనా మోగుతుందా?

వాయిదా పడడం  ఆనవాయితీగా మార్చుకున్న చిత్రం ‘డమరుకం’. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ ప్రకటించి ఆ తరవాత వాయిదా వేసారు. తాజా సమాచారం ఏమిటంటే… ఈ సినిమాని 23న విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆర్ధిక లావాదేవీలన్నీ సత్వరం పూర్తిచేసి ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేవారం తీసుకురావాలని నాగార్జున భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. ఈ సారి చెప్పిన తేదీకి సినిమాని తీసుకురాకపోతే… అభాసుపాలు కావడం ఖాయం. అందుకే… ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని విడుదల తేదీ ప్రకటించాలని నాగార్జున భావిస్తున్నారు. అవసరమైతే… కొంత మొత్తం తనే సర్దుబాటు చేసి.. అడ్డంకులు తొలగించాలని నిర్ణయించుకున్నారట. 23న డమరుకం మోగడం… దాదాపు ఖాయమే. అయితే ఈ విషయమై దర్శక నిర్మాతలు ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన చేయలేదు.