‘డమరుకం’ పుణ్యమా అని….

వచ్చేస్తుంది అనుకున్న ‘డమరుకం’ వాయిదా పడింది. 11న విడుదల కావలసిన ‘బస్ స్టాప్’ ఒక రోజు ముందే వచ్చేసింది. నాగార్జున సినిమా లేకపోవడంతో థియేటర్ లన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశ్యం తో ‘బస్ స్టాప్’ని సడన్ గా తెసుకోచ్చేస్తున్నారు. 11వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నా…. ‘డమరుకం’ వాయిదా పడడం తో శనివారం ‘బస్ స్టాప్’ విడుదలకు మార్గం దొరికింది. మల్టీప్లెక్స్ లో శనివారం సాయంత్రం నుంచి ‘బస్ స్టాప్’ చూడొచ్చు. మిగతాచోట ఆదివారం ప్రింట్లు వెళ్లనున్నాయి. ఎనిమిది కట్స్ తో ఈ సినిమాకి సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికెట్ యిచ్చారు. అయినా ఈ సినిమా లో అభ్యంతర కరమైన సన్నివేశాలు చాలానే వున్నాయని వినికిడి. సినిమా వివాదాలు ఎక్కువైన ఇలాంటి తరుణం లో ఈ సినిమా ఇంకెన్ని కొత్త సమస్యలు తీసుకొస్తుందో చూడాలి.