టీఎస్ఆర్ పై ధ్వజమెత్తిన దగ్గుబాటి !

Daggubatiవైజాగ్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ లో రోజు రోజుకి వివాదం ముదురుతోంది. ఇప్పటికే విశాఖలో కేంద్రమంత్రి పురంధేశ్వరి, మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త టి. సుబ్బిరామిరెడ్డిలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు
తెలుస్తోంది. ఈ మధ్య కాలంతో టిఎస్ఆర్ వేదిక ఏదైనప్పటికినీ.. విశాఖ నాదే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జిల్లాలో నేను చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిందని, అమ్మ నాకు హామి ఇచ్చిందని… రకరకాలుగా మాట్లాడుతూ వైజాగ్ లోక్ సభ స్థానం విషయంలో వేడినిపుట్టిస్తూనే ఉన్నారు. ఆయన కమెంట్స్ పై కేంద్రమంత్రి పురంధేశ్వరి తరుపున మాత్రం ఎవరు స్పందించలేదు. అయితే, తాజాగా పురంధేశ్వరి భర్త, పరుచూరి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫస్ట్ టైమ్ ఈ విషయంపై స్పందించారు. విశాఖ సీటు పురంధేశ్వరికి ఇవ్వొద్దని
2009లోనే సుబ్బిరామి రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారని.. అయితే ఏమయిందని ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో.. సిమెంట్ ను బ్లాక్ లో అమ్ముకొని సుబ్బిరామిరెడ్డి అరెస్ట్ అయ్యారని, కాంట్రాక్టు ఒప్పందాల లొసుగుల ఆధారంగానే డబ్బులు సంపాందించడమే ఆయన పని అని దగ్గుబాటి ధ్వజమెత్తారు. తాజా వ్యాఖ్యలతో పురంధేశ్వరి, సుబ్బిరామిరెడ్డిల మధ్య వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది.