చేనేత దుస్తులతో వావ్ అనిపించిన దగ్గుపాటి ఫ్యామిలీ

రానా- మిహికా ల వివాహం రామానాయుడు స్టూడియో లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వివాహ బంధం తో ఒకటయ్యారు. కరోనా వైరస్ కారణంగా వివాహ వేడుకకు పెద్దగా ఎవర్ని ఆహ్వానించలేదు.

తాజాగా ద‌గ్గుబాటి ఫ్యామిలీ అంత చేనేత దుస్తులు ధరించి వావ్ అనిపించారు. వెంక‌టేష్‌, సురేష్ బాబు పంచెల‌లో క‌నిపించ‌గా, మిగ‌తా వారంద‌రు చీర‌ల‌లో మెరిసారు. ఆగ‌స్ట్ 8న రానా- మిహికాల పెళ్లి వేడుక జ‌ర‌గ‌గా, ఆ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. ఇవి నెటిజ‌న్స్‌ని ఆక‌ర్షిస్తున్నాయి.