తెలంగాణ ఇస్తారన్న విశ్వాసం ఉంది : డీఎస్

D. srinivasకాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైనట్లు వార్తొలొస్తున్న నేపథ్యంలో.. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నేతలు అధిష్టాన జపం ప్రారంభించారు. తాజాగా, కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. నేతలంతా.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొనడం హర్షణీయమని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికినీ.. తెలుగు ప్రజలంతా.. సమైక్యంగానే ఉంటారని భావిస్తున్నట్లు డీఎస్ వ్యాఖ్యానించారు. కాగా, కరుగుడు గట్టిన సమైక్యాంధ్రా వాదిగా ముద్రపడిన కేంద్ర మంత్రి కావూరి కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.