Site icon TeluguMirchi.com

రష్యా నుంచి నాలుగు వ్యాక్సిన్లు

రష్యాలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రష్యాలోని ప్రభుత్వ రంగ సంస్థ గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే కీలక దశలు అధిగమించి క్లినికల్ ట్రయల్స్ లోనూ అమోఘమైన ఫలితాలను ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రష్యా నుంచి మరో మూడు వ్యాక్సిన్లు కూడా క్లినికల్ ట్రయల్స్ దశలోకి ప్రవేశించాయి.

దీనిపై రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ మాట్లాడుతూ, తమ దేశంలో 26 కంటే ఎక్కువ వాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని, అందులో 4 వ్యాక్సిన్లు సురక్షితమైనవిగా భావిస్తున్నామని తెలిపారు. ఆ నాలుగు వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగించేందుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నామని మిషుస్తిన్ వెల్లడించారు.

Exit mobile version