మామిడి తొక్కు ఏంటి కరోనా భయం పుట్టించడం ఏంటి అనుకుంటున్నారా..అయితే మీరు ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.. కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త ఊరంతంటికి పంచిపెట్టడం కోసం మామిడి తొక్కు పెట్టిదామని అనుకున్నాడు. ఆలా అనుకోవడమే ఆలస్యం ప్రజాప్రతినిధి భర్త, ఆయన బంధువు ఇద్దరూ కలిసి మామిడి తొక్కు పెట్టే వారిని కలిసి ఒప్పందం చేసుకున్నారు. తిరిగి ఊరెళ్లాక ప్రజాప్రతినిధి భర్త ఈ విషయాన్ని మీటింగ్ పెట్టి అందరికీ చెప్పాడు. రెండు రోజుల తర్వాత మామిడి తొక్కు పెట్టడం కోసం షాద్ నగర్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొల్లూరు వెళ్లారు. రోజంతా ఉండి 12 మంది సాయంతో 2 క్వింటాళ్ల తొక్కు పెట్టారు.
ప్రజాప్రతినిధి భర్త వెళ్లి షాద్‌నగర్‌లో కలిసొచ్చిన బంధువుకు కరోనా పాజిటివ్ అని తేలింది. అనుమానం వచ్చి తొక్కు పెట్టిన ఇద్దరికి కరోనా పరీక్షలు చేయగా.. వారికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో వారితో సన్నిహితంగా మెలిగిన ప్రజాప్రతినిధి భర్తతోపాటు ఊళ్లో వాళ్లందరికీ కరోనా భయం మొదలైంది. ఆ తొక్కు మొత్తాన్ని డంప్ యార్డులో పారేసి.. అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రజాప్రతినిధి భర్త, తొక్కు పెట్టిన వారితో ఉన్న 12 మందిని, వారి కుటుంబ సభ్యుల్ని.. ఇలా వంద మంది హోం క్వారంటైన్లో ఉంచారు.