కరోనా మహమ్మారి చిత్రసీమను వణికిస్తోంది. ప్రతి రోజు ఎవరో ఒకరు దీనిబారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు చికిత్స తీసుకుంటుండగా..తాజాగా పలు సినిమాల్లో , సీరియల్స్ లలో నటిస్తున్న శివపార్వతి కరోనా బారిన పడింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలుపుతూ .. తనకు కరోనా సోకినా ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నటీనటులకు ఇన్స్యూరెన్స్ చేయిస్తున్నారనే మాట ఎంత వరకు నిజం అని ప్రశ్నించారు శివపార్వతి. ఒక వేళ తనకు అలాంటిది చేసి ఉంటే, తనకు వర్తిస్తుందా? లేదా? అని ఎందుకు పట్టించుకోలేదు? వదినమ్మ సీరియల్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ కూడా తన బాగోగులు అడగలేదని వాపోయింది. ఇంకామన్నదో ఈ కింది వీడియో లో చూడండి.