సింగర్ మాళవికకు అలాగే ఆమె కూతురికి కరోనా ..

కరోనా మహమ్మారి ఎవరి వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా సోకుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చిత్రసీమ ప్రముఖులు దీనిబారిన ఎక్కువగా పడుతున్నారు. రీసెంట్ గా సింగర్ మాళవిక కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రతుతం ఈమె హోం ఐసోలేష‌న్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు రెండేళ్ల కుమార్తె కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్టు మాళ‌విక ప్ర‌క‌టించారు.

ఏ పాపం తెలియ‌ని రెండేళ్ల చిన్నారి క‌రోనా బారిన ప‌డింద‌నే స‌మాచారం ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుల్ని అయ్యో అనిపిస్తుంది. మాళ‌విక త‌ల్లిదండ్రులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. జ‌లుబు, జ్వ‌రం ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టెస్ట్ చేయించుకోగా క‌రోనా అని నిర్ధార‌ణ అయిన‌ట్టు మాళ‌విక తెలిపింది.