Site icon TeluguMirchi.com

ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం

congress-core-committeeప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఘటన, ఆహార భద్రత బిల్లు చట్టబద్ధత అంశం, టీ ఎంపీల రాజీనామాలు, తెలంగాణ అంశంతో పాటు ఇతర సమస్యలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అహ్మద్ పటేల్, చిదంబరం, ఏకే ఆంటోనీ, ఆజాద్ హాజరయ్యారు.

అయితే, టీ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు, తెలంగాణ అంశంపై మొదటి గంటన్నర పాటు ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాం నబీ ఆజాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలపై చర్చి జరిగినంత సేపు ఆజాద్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన బయటకు వెళ్లిపోయారు. అనంతరం కోర్ కమిటీ ఆహార భద్రత బిల్లు చట్టబద్దతపై చర్చించింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆహార భద్రత బిల్లును ఆమోదించాలని నిర్ణయించిందని తెలుస్తోంది.

Exit mobile version