Site icon TeluguMirchi.com

17 నుంచి సీఎం సమీక్షా సమావేశాలు !

CM-kiranత్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. దీంట్లో భాగంగానే ఈ నెల 17 నుండి 22 వరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ముఖ్యమంత్రి
దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు సెమీ ఫైనల్ లా భావించే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటేనే.. అధిష్టానం, అసమ్మతి నేతల దగ్గర అప్రతిష్ట పాలుకాకుండా ఉండవచ్చనే
ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version