Site icon TeluguMirchi.com

ఆ ఇద్దరూ.. ఒకే కారులో.. !

CM-Kiran-KUmar-Reddy-Vs-Deputy-CM-Damodar-Narasimha-

“ఛలో అసెంబ్లీ” కాంగ్రెస్ ప్రభుత్వానికి చేటు చేస్తుందని భావించిన వారందరికీ ఓ షాక్ లాంటి వార్తా !. అదేనండి ’ఛలో అసెంబ్లీ’ పుణ్యమా అని సీఎం, డిప్యూటీ సీఎం ఒకే కారులో షికారు చేశారు మరి. గతకొంతకాలంగా.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. సీఎం ఉన్న సభలో డిప్యూటీ ఉండరు. డిప్యూటీ వున్న సభలో సీఎం ఉండరు. అది సొంత జిల్లా అయినా సరే, ఈ రూల్ రూట్ మారదు. ఒకవేళ ఇద్దరూ తప్పనిసరిగా ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తే.. ఆ కోల్డ్ వార్ లో ఎన్నో రాజకీయతంత్రీలు కట్టలు తెంచుకుంటాయి. ఒకరిపై ఒకరు కావాల్సినన్ని సూటిపోటీ మాటలు అనుకుని సంతృప్తినొందుతారు.

అలాంటి వీరిద్దరూ ఒకే వాహనంలో ప్రయాణించడం ఆశ్చర్యమే కాదు.. ఓ వింతలాంటిదే మరీ. అయితే, ఛలో అసెంబ్లీ ఎఫెక్ట్ తో వీరిద్దరు ఒకే కారులో.. అది కూడా దామోదర రాజనర్సింహ కారులో కిరణ్ ప్రయాణించాడు. అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లీ బయట తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో.. శాసనసభ నుంచి వీరిద్దరూ ఒకే వాహనంలో వెళ్ళాల్సి వచ్చింది. తెలంగాణ వాదులు అడ్డుకుంటారన్న భయంతో.. వెంట కాన్వాయ్ కూడా లేకుండా ఈ ముఖ్యోపముఖ్యమంత్రులు అసెంబ్లీ నుంచి జారుకున్నారు. వాదం గీదం జాన్ తా నయ్.. వాయించకుండా ఉంటే చాలనుకున్నారో ఏమో మరీ !

Exit mobile version