కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం ఫై క్లారిటీ

చందమామ కాజల్ రహస్యంగా ఎంగేజ్‌మెంట్ జరుపుకుందా..ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇవే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తల్లిదండ్రులు చూపించిన సంబంధానికే కాజల్ ఓకే చెప్పిందని, కాజల్ పెళ్లి చేసుకునే వ్యక్తి పేరు గౌతమ్ అని తెగ ప్రచారం అయ్యింది. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే కావొచ్చని అనుకున్నారు. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కాజల్ అగర్వాల్ ప్రతినిధి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు.

ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పాడు. ప్రస్తుతం కాజల్ దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, సినిమాలతో ఆమె బిజీగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఆచార్య, మోసగాళ్లు, హే సినామిక, ప్యారిస్ ప్యారిస్, ముంబై సాగ చిత్రాల్లో కాజల్ నటిస్తోంది.