గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్లు , థియేటర్స్ మూతపడడం తో చిత్ర సీమా నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదింపులు జరిపి షూటింగ్స్ కు అనుమతిని కోరారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా షూటింగ్ పర్మిషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి సినిమా పెద్దలు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ కోరగా.. అపాయింట్ మెంట్ కూడా లభించిందని సమాచారం. మరి ఈ మీటింగ్ సినిమా షూటింగ్స్ కు అనుమతుల కోసమా.. ఏపీలో సినిమా ఇండస్ట్రీ డవలప్ మెంట్ వంటి అంశాలను గురించి మాట్లాడేందుకా అనేది తెలియాల్సి ఉంది.