తరుణ్‌కి బీభత్సమైన బ్యాడ్ టైమ్ నడుస్తోంది. పట్టిన సినిమా మాడి మసైపోతోంది. ఆ లిస్టులో చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి కూడా చేరిపోయింది. తరుణ్ విమలారామన్ జంటగా నటించిన చిత్రమిది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ముందే ప్రకటించారు. ఒక రోజు ఆలస్యంగా అంటే శనివారం ఈ సినిమా గుట్టుచప్పుడు కాకుండా వచ్చేసింది. తరుణ్ సినిమా కూడా చూడాలా..? అని ప్రేక్షకులు లైట్ తీసుకొన్నారు. అందుకే తరుణ్ – విమలా హాట్ పోస్టర్లు ఊరించినా థియేటర్లో అడుగుపెట్టడానికి కూడా సాహసించడం లేదు. పరిస్థితిని గమనించిన చిత్రబృందం ఆదివారం సక్సెస్ మీట్ పెట్టి… మా సినిమాకి వసూళ్లు అదిరిపోయాయి.. అంటూ డాంభికాలు పలకడం మొదలెట్టారు. రిలీజైన రెండో రోజే సక్సెస్ మీట్ పెట్టారంటే.. ఆ సినిమా గురించి వేరే చెప్పాలా?? పాపం…తరుణ్ అని బాధపడడం తప్ప.