Site icon TeluguMirchi.com

బాలయ్య పక్కన చార్మి యా ?

chrami balakrishnaయువరత్న బాలకృష్ణ, ‘ సింహా ‘ దర్శకుడు బోయపాటి శ్రీను ల సంచలానాత్మక కాంబినేషన్ లో వస్తున్న జయసింహ చిత్రంలో ఎట్టకేలకు కధానాయిక కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అనేకమంది కధానాయికలను ఈ సినిమాలో బాలయ్య పక్కన కధానాయికగా ప్రయత్నించారు. కాని ఎవరూ ఫిక్స్ కాలేదు. ఎలారా బాబూ అని నిర్మాతలు తలపట్టుకుని కూర్చున్న తరుణంలో చార్మి పేరును బోయపాటి శ్రీను యే ప్రతిపాదించారట. బాలయ్య కూడా రెండో మాట లేకుండా సరే అన్నారట. దాంతో చార్మి గోల్డెన్ చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం సినిమాలు ఏమీ లేక గోళ్ళు గిల్లుకుంటున్న చార్మి కి ఇది బంపర్ ఆఫర్ గా చెప్పవచ్చు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో మాస్ హీరో బాలయ్య పక్కన హీరోయిన్ అవకాశం రావటం తో చార్మి ఆకాశంలో డాన్సులేస్తోందట.

Exit mobile version