ప్రముఖ సినిమా ఫోటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు తనను మోసం చేశాడంటూ అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన సాయి సుధా అనే ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం రేపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని .. సాయి సుధా శ్యామ్ కె నాయుడి ఫ్యామిలీ పైన కేసు ఫైల్ చేసింది. ప్రస్తుతం కేసు తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
కాగా శ్యామ్ కె నాయుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకె నాయుడు తమ్ముడన్న విషయం తెలిసిందే. అయితే సాయి సుధా పోలీస్ కేసు శ్యామ్ కె నాయుడు ఫ్యామిలీ మొత్తమీద పెట్టింది. హీరో సందీప్ కిషన్ తల్లి (శ్యామ్ కె నాయుడు సోదరి) ఆమె భర్త ( సందీప్ కిషన్ తండ్రి ) కూడా ఈ వివాదంలో సాయి సుధా ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారు . వారి పైన కూడా ఆమె పోలీస్ కేసు ఫైల్ చేసింది. అలాగైనా తనకు శ్యామ్ కె నాయుడు కావాలని ఆమె అంటుంది అయితే నటి సుధ చేసిన ఆరోపణలపై సినీ రంగం నుండి ఎవరూ స్పందించలేదు. సున్నితమైన అంశం కావడంతో ఏం మాట్లాడితే ఏం మెడకు చుట్టుకుంటుందోనని అందరూ మౌనం వహించారు. అయితే ఈ వివాదంలో చోటా కె నాయుడు తమ్ముడికి అండగా నిలబడతాడా..? అన్న ప్రశ్న ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.