డాన్స్ అంటే చిరంజీవిదే.. అనేది ఇప్పటికీ అందరి మాట. ఎవరు ఎంత చించుకొని స్టెప్పులేసినా చిరంజీవిని బీటవుట్ చేయలేరనే విషయం అందరూ ఒప్పుకొనేదే. చిరుకి డాన్స్ అంటే ప్రాణం. సినిమాలకు దూరమయిన తరవాత చిందేసే అవకాశం రాలేదు. టూరిజం మంత్రిగా ఒకట్రెండు సార్లు పొలిటికల్ వేడుకల్లో డాన్స్ చేశారు. ఇప్పుడు మరోసారి స్టెప్పులేశారు. అది సినిమా వేడుకలోనో, పొలిటికల్ స్టేజీ పైనో కాదు. తన ఇంట్లో. మనవరాళ్ల మధ్య. ఎవడు పాటల్ని ఇటీవలే ఆయన తన ఇంట్లో విన్నారట. ఆ బీట్ విని ఆపుకోలేక… ఇంట్లో డాన్స్ చేశారట. ఈ సంగతి చింరజీవి స్వయంగా అభిమానుల సమక్షంలో చెప్పారు. ఎవడు పాటలు సూపర్ హిట్ అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏం కావాలి?