చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారట. కరోనా ప్రభావం తగ్గాక ఈ సెట్ లో మెగాస్టార్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటె ఈ మూవీ తర్వాత మెగాస్టార్ ఏ సినిమా చేయబోతున్నాడనే ప్రశ్నకు జవాబు దొరికేసింది. తమిళ సూపర్ హిట్ చిత్రం “వేదాళం” రీమేక్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సినిమా విషయంలో గత కొంత కాలం నుంచీ బజ్ వినిపిస్తుంది. కానీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మెగాస్టార్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫామ్ అయ్యిందట. ఇక ఈ చిత్రంపై అధికారిక ప్రకటన మెగాస్టార్ పుట్టినరోజు ఆగష్టు 22న అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని నిర్మాత అనీల్ సుంకర మరియు రామ్ చరణ్ లు సంయుక్తంగా నిర్మించనున్నారని టాక్.