Site icon TeluguMirchi.com

చిరు చేసిన ‘చింత తొక్కుతో చేప‌ల ఏపుడు’

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు బంద్ కావడం తో సినీ నటి నటులకు ఫుల్ రెస్ట్ దొరికింది. ఎప్పుడు సినిమా షూటింగ్ లతో గడిపే వీరంతా ఇప్పుడుకుటుంబ సబ్యులతో గడుపుతూ తమ టాలెంట్ లను చూపిస్తున్నారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త‌న పోస్ట్‌ల‌తో నెటిజ‌న్స్‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తున్నారు. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ని షేర్ చేస్తున్నారు. ఆదివారం ఉద‌యం తాను ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేస్తానంటూ ఓ ట్వీట్ చేశారు. అన్న‌ట్టుగానే తాను చేసిన వంట‌కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

సీ ఫుడ్‌ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే చిరంజీవి చేప‌ల వేపుడు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. త‌న అమ్మ చేసిన వంటైతే మ‌రీ ఇష్ట‌మ‌ట‌. సండే ఖాళీగా ఉన్నందున ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ వంటలోని తన నైపుణ్యాన్ని చూపించారు ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేశానంటూ చిరు.. ఆ వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. View this post on Instagram

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on Aug 9, 2020 at 9:36pm PDT

Exit mobile version