దాసరి మరణం తర్వాత ఇండస్ట్రీ కి చిరంజీవి పెద్ద దిక్కు అయ్యారు. చిన్న చిత్రాల ప్రమోషన్ దగ్గరి నుండి చిత్ర సీమా ఆపదలో ఉంటె దగ్గరి ఉండి ముందుకు నడిపే వరకు అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. కానీ ఇకపై వాటికీ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట.
తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే చిరు నిర్ణయానికి కారణం అంటున్నారు. మీటింగ్‌కు బాలకృష్ణను పిలవకపోవడం.. భూములు పంచుకుంటున్నారని ఆయన సీరియస్ కావడం.. ఆ తర్వాత అవి చాలా పెద్ద రచ్చకు దారి తీయడంతో చిరంజీవి బాగానే హర్ట్ అయినట్లు తెలుస్తుంది. అందుకే ఇకపై అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.