కరోనా వైరస్ తెలుగు చిత్రసీమ ను అతలాకుతలం చేసింది. గత మూడు నెలలుగా థియేటర్స్ బంద్ కావడం , షూటింగ్ ఆగిపోవడం తో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. ఒకవేళ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యినకాని మునపటిలాగా ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో దర్శక , నిర్మాతలకు చిరంజీవి సలహా ఇస్తున్నారట.
భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ఆలోచన మానుకోవాలనేది, ఆయన మొదటి సలహా అట. ముందుగా మెగా కంపౌంట్ నిర్మాతలైన అల్లు అరవింద్, రామ్ చరణ్ లకు కూడా ఆయన ఇదే సలహా ఇచ్చారట. ఇది వరకే భారీ బడ్జెట్ చిత్రాలకు అడ్వాన్స్ లు ఇచ్చి ఉంటే వెనక్కి తీసుకోవడం మంచిదని కూడా ఆయన చెప్పారట. ఇక రామ్ చరణ్ నిర్మాతగా ఆయన నటిస్తున్న ఆచార్య మూవీ బడ్జెట్ కూడా తగ్గించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం.