మరో వంట ను రుచి చూపించిన చిరు

లాక్ డౌన్ వేళ చిరంజీవి వంటింట్లో రుచికరమైన వంటలు వండుతూ అందర్నీ ఊరిస్తున్నాడు. ముఖ్యంగా ఆయనకు సీఫుడ్ అంటే బాగా ఇష్టమట. సీ ఫుడ్ లో చేపల ఏపుడు అంటే మరీ ఇష్టమని.. అందుకే ఆయన ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ వంటలోని తన నైపుణ్యాన్ని చూపించారు ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేశానంటూ చిరు.. ఆ వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట!#SundaySavorshttps://t.co/QxIN8cnuGQ— Chiranjeevi Konidela (@KChiruTweets) August 10, 2020