చరణ్ కు జాగ్రత్త చెప్పాడట..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జాగ్రత్తగా ఉండని హెచ్చరిచాడట..ఇంతకీ ఆ హెచ్చరిక ఎవరు ఇచ్చారో తెలుసా..మెగా స్టార్ చిరంజీవి. రీసెంట్ గా చిరంజీవి సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి తన దూకుడు ను కనపరుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వ‌య‌సులోనూ సోష‌ల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా ఉన్న చిరంజీవిని చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌ను అడిగితే.. ‘‘నువ్వు జాగ్ర‌త్త చ‌ర‌ణ్‌.. నేను వ‌స్తున్నాను(సోష‌ల్ మీడియా ఎంట్రీని ఉద్దేశించి) అన్నారు. నాన్న‌గారు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండ‌ట‌మే కాదు.. ఎంజాయ్ చేస్తున్నారంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.