Site icon TeluguMirchi.com

నాగబాబు కు చిరు సపోర్ట్

రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ.

బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని నాగబాబు వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నందమూరి అభిమానులకు , మెగా అభిమానులకు మధ్య కోల్డ్ వార్ మొదలయ్యింది. చిత్ర సీమా ప్రముఖులు సైతం కొంతమంది నాగబాబు కు , మరికొంతమంది బాలయ్య కు సపోర్ట్ ఇస్తూ మాట్లాడారు. తాజాగా చిరంజీవి ఈ వ్యవహారం ఫై స్పందిస్తూ నాగబాబు కు సపోర్ట్ గా మాట్లాడారు.

చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు నాగబాబు వ్యాఖ్యల్ని ఖచ్చితంగా సమర్ధిస్తున్నా.. నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు నా తమ్ముడు. చాలా శాంతంగా ఉంటాడు.. మంచి వ్యక్తి. అనవసరంగా మాట్లాడే వ్యక్తి కాదు. కాని తాను హర్ట్ అయితే మాత్రం ఊరుకోడు. ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాడు. వెటకారంగా ఒకర్ని కించపరచాలని అనుకోడు. చాలా సంస్కారం గానే ఉంటాడు. కాని ఈ విషయంలో తను హర్ట్ అయ్యాడు. అందుకే ఇలా రియాక్ట్ అయ్యాడు.

ఇదే పరిస్థితి నాకు వస్తే కనుకు.. అన్నీ దిగమింగుకుని భరిస్తాను తప్ప.. ఇలా ఓపెన్ కాను. అది నా నేచర్. కాని నాగబాబు నేచర్ అది కాదు. ఎవర్నీ ఏమీ అననటువంటి మా ఫ్యామిలీపై అనవసరంగా బురదజల్లి ఎటకారంగా మాట్లాడి.. కించపరిస్తూ.. సెన్స్ లేకుండా మాట్లాడితే.. తను హర్ట్ అయ్యాడు. దాని ప్రభావం మొన్న బయటపడింది. అది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే ఉండొచ్చు తప్ప.. తప్పు అని అనను.

చిరంజీవి ఫ్యామిలీ సాఫ్ట్ టార్గెట్ అవుతుంది.. ఇదే మాట గతంలో కూడా అన్నాను. ఎందుకు అన్నానంటే.. నేను ఎవరితోనూ పెట్టుకోను. ఎవర్నీ ఏమీ అనను.. ఒకవేళ నన్ను ఎవరైనా ఏమైనా అంటే అక్కడితే వదిలేస్తా.. పెద్దది చేయను. పక్కన పడేసి.. నా పని నేను చేసుకుని వెళిపోతా. ఇది నా నేచర్. అందుకే ఇతన్ని ఏమైనా అనొచ్చనేది వాళ్ల నేచర్ కావచ్చు. నేను ఊరుకోవచ్చు.. నన్ను ప్రేమించే అభిమానులు, నా సోదరులు ఊరుకుంటారా? అవకాశం వస్తే వాళ్లు ఎందుకు ఊరుకుంటారు. అడగాల్సింది అడుగుతారు.. కడగాలంటే కడిగేస్తారు. ఇప్పుడే అదే జరిగింది’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

Exit mobile version