కానీ కాలం గడచినా చిరంజీవి ప్రభ మళ్ళీ మునుపటిలా వెలుగుతుందా అనేదే ఇప్పటి రాజకీయ వర్గాల ప్రశ్న? ఎందుకంటే, చిరంజీవి వెనుక వున్న 18 % వోట్లు, రాష్ట్ర ఎన్నికల విషయంలో కాపు సామాజిక వర్గానికి వున్న ప్రాధాన్యం, ఆ వర్గాలలో చిరంజీవి కి మునుపటి ఎన్నికల్లో వచ్చిన వోట్లు, కొన్ని సీట్లు, ఇవన్నీ కలిసి చిరంజీవిని రాజ్యసభకి ఎంపిక చేయడానికి, తదుపరి మంత్రి పదవి ఇవ్వడానికి దారి తీసాయి. కానీ చిరంజీవ కి రాజాకీయ జీవితంలో టైమ్ పెద్దగా ఆచ్చి రానట్టుంది. మంత్రి పదవి వచ్చిన కొన్ని నెలలకే విభజన నిర్ణయం తీసుకోండి కేంద్రం. దాంతో చిరంజీవికి మళ్ళీ రాజకీయ కష్టాలు ప్రారంభమయ్యాయి.
కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతమే వద్దు, నాకు తెలంగాణే ముద్దు, అక్కడ వున్న 17 ఎంపీ సీట్ల మీదే ఆలోచిస్తూ మానసికంగా ఆంధ్రని, అక్కడ సీట్లని కోల్పోవడానికి సిద్దపడిన కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చర్యలతో చిరంజీవికి తన ముందున్న దారి అయోమయమే అయింది. అసలు చిరంజీవిని కాంగ్రెస్ లోకి తెచ్చిన కారణాలు ఇప్పుడు కాంగ్రెస్ కు అప్రస్తుతమయ్యాయి. ఏ కాపు సామాజిక వర్గాని కోసం అయితే చిరంజీవిని కాంగ్రెస్ లోపలికి తెచ్చారో ఆ వర్గం గురించి, ఇప్పుడు పట్టించుకొనే తీరిక కాంగ్రెస్ కు లేదు.
చిరంజీవి పరిస్థితి ఇప్పుడు అయోమయం. ఒక వైపు కేంద్ర నాయకత్వాన్ని పూర్తిగా కాదనలేని పరిస్థితి. ఇంకొకవైపు రాష్ట్రంలో కొడిగట్టుతున్న తన ప్రాభవం. తన వర్గానికి పూర్తిగా నాయకత్వం కూడా అందించలేని పరిస్థితి. పార్టీ బయటకు రావాలో, లేదా కిరణ్ లాగా వేరే పార్టీ పెట్టాలో, లేదా తన పాత పార్టీ ని పునర్జీవింప చెయ్యాలో, తేల్చుకోలేని అయోమయ స్థితిలో వున్నారు.
తన స్వంత తమ్ములు ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోకి చేరుతారని తీవ్ర ప్రచారం జరుగుతున్న నేపధ్యం ఒక వైపు, ఇంకొక వైపు తన స్వంత కాపు సామాజిక వర్గం తన నుండి జారిపోతున్న విషయం మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమవటం, తెలుగుదేశం పార్టీ కోస్తా ప్రాంతంలో తన పూర్వ వైభవానికి దగ్గరగా రావటం, విభజన వలన మారిన పరిస్థితులలో తన ముఖ్య అనుచరులు అనుకొన్న ఘంటా, వంగా గీత, భండారు,తదితరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొనే పరిస్థితిలో వుండటం, ఇవన్నీ చిరంజీవికి రాజకీయ గడ్డు పరిస్థితిని తెచ్చి పెట్టాయి.
తన కంటే, తన పాత ప్రజా రాజ్యం సహచరులైన ఘంటా మొదలగు వారు సమైక్య ఆంధ్ర ఉద్యమంలో ముందుకు దూసుకు పోతుంటే, తాను మాత్రం ఎటూ చెప్పలేక మౌనంగా వుండాల్సి రావటం గడ్డు పరిస్థితే. పార్లమెంటులో రాజ్యసభ సీటు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక స్థానంలో నిలుచోని గెలవాల్సిన పరిస్థితి అయితే లేదు. అంతవరకు అదృష్టవంతుడు. కానీ ఒక పార్టీకి అధినేతగా వుండి, ఈ వేళ ఇంత అప్రాధాన్య స్థితికి చేరడం చిరంజీవికి నిజంగా మింగుడు పడని స్థితే.
తనకు రాజకీయ జీవితం, ఇంత ప్రాధాన్యం ఇచ్చిన కాపు సామాజిక వర్గాన్ని కూడా పణంగా పెట్టి చిరంజీవి మంత్రి పదవిని, కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని నమ్ముకొన్నాడు. ఎటూ ఎన్నికల్లో పోటీ చేసే అవసరం లేదు కాబట్టి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధికారం లోకి వస్తే..అంతా మేలే అని చిరంజీవి ఆలోచన. అందువలన తన మీద అత్యంత నమ్మకం చూపించి క్రితం ఎన్నికల్లో ఓట్లు వేసిన కాపు సామాజిక వర్గాన్ని కూడా వదిలేసేందుకు సిద్దపడ్డాడు. కాంగ్రెస్ నే నమ్ముకొంటే, అది ఎన్నికల్లో గెలిస్తే, ఏమో గుర్రం ఎగరా వచ్చు… తన రాజ్యసభ, మంత్రి పదవి, బహుశా కాబినెట్ రాంకుతో కలిసి కూడా రావచ్చు అని ఆలోచనేమో. కానీ గుర్రం ఎగురుతుందా అన్నదే ప్రశ్న..??!!