Site icon TeluguMirchi.com

మెగా ఫోన్ పడుతున్నాడు

Chinni-krishnaరచయితలంతా ఎప్పుడో ఒకప్పుడు దర్శకత్వం వైపు టర్న్ తీసుకోవడం మామూలే. త్రివిక్రమ్ తరవాత ఈ మార్పిడి కాస్త ఎక్కువైంది. ఇప్పుడు మరో రచయిత మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. ఆయన చిన్నికృష్ణ. ‘నరసింహా’, ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. త్వరలోనే ఆయన సూర్యతో ఓ సినిమా తెరకెక్కెస్తారని సమాచారమ్. ఇప్పటికే కథ పూర్తయిందట. చిన్నకృష్ణతో జత కట్టడానికి సూర్య కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ తెరకెక్కించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

Exit mobile version