Site icon TeluguMirchi.com

చంద్రబాబు….420 : విజయమ్మ

రాష్ట్రంలో అదేపనిగా అబద్ధాలాడుతున్న టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు, అబద్ధాలను పదే పదే ప్రచారం చేసి నిజమని నమ్మించేందుకు గోబెల్స్ అనే మంత్రిని ప్రత్యేకంగా నియమించుకున్న హిట్లర్ జన్మదినం.. ఒకటేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వీరిద్దరూ 4వ నెల 20వ తేదీన పుట్టారని, 4, 20లను కలిపితే వచ్చే 420 చంద్రబాబుకు బాగా సరిపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదని విమర్శించారు. 1994లో టీడీపీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి ఇప్పుడు మళ్లీ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వడ్డేపల్లి నర్సింగరావు పార్టీలో చేరుతున్న సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ విజయమ్మ పై వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబుకు ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందితే నిలదీయడానికి మనసురావడంలేదని అన్నారు. అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విజయమ్మ విమర్శించారు.

Exit mobile version