బన్నీ సంస్కారం!

allu-arjunపెద్ద సినిమా విడుదల జరిగేముందు చిన్న సినిమాలు తమ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవడం సహజం. ఇందు కోసంపెద్ద సినిమాలను తప్పు పట్టలేము. తాజాగా ‘ఇద్దర‌మ్మాయిల‌తో’ విషయంలో ఇదే జరిగింది. ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించడంతో రిలీజ్ కు సిద్దంగా వున్న కొన్ని చిన్న సినిమాలు విడుదలను వాయిదా  వేసుకున్నాయి. అయితే అనుకున్న తేదికి ఈ చిత్రం విడుదల కాలేదు. దింతో చిన్న సినిమాల  మరి కాస్త ఇబ్బంది లో పడ్డాయి. అయితే ఇదే ఈ విషయం పై బన్నీ మాట్లాడుతూ.. ‘ఇద్దర‌మ్మాయిల‌తో’ చిత్రం విడుదలలో తలెత్తిన ఇబ్బంది వాస్తవమే. చిత్రం రెండు సార్లు వాయిదా పడడంతో చిన్న సినిమాలు అనుకున్న తేదికి విడుదలకు నోచుకోలేకపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ లో కాస్త జాప్యం జరగడం వల్లే ఇలా జరిగింది. అందుకే అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయాం. మా వల్ల కొన్ని సినిమాల రిలీజ్ లకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. అందుకు మన్నిచండి అంటూ చిన్న సినిమాల పై తనకున్న అభిమానాన్ని, సంస్కారాన్ని చాటుకున్నాడు బన్నీ.