లాక్ డౌన్ సందర్భాంగా అనేక టెలికం సంస్థలు డేటా ఆఫర్లు భారీగా ప్రకటించగా..ప్రభుత్వ సంస్థ అయినా బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఆఫర్లు ప్రకటించి వినియోగదారులకు కాస్త ఊరట ఇచ్చింది. రూ. 1,498 ప్లాన్‌ను తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్.. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 91 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తోంది. డేటా వ్యాలిడిటీ 365 రోజులగా పెట్టింది.
ఇక, మరి కొన్ని డేటా వోచర్లను కూడా విడుదల చేసింది బీఎస్ఎన్ఎల్.. రూ. 96 డేటా వోచర్‌తో 11 జీబీ డేటాను అందివ్వనున్నారు.. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇక, రూ. 48 ప్లాన్‌తో 5 జీడీ డేటాను పొందవచ్చు.. డేటాతో పాటు ఈ వోచర్స్ ద్వారా అద్బుతమైన ఓటీటీ సర్వీసులను కూడ అందిస్తున్నారు. మీకు సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు కావాలను కుంటే మీరు రూ.98 డేటా వోచర్ వేసు కోవచ్చు.. దీనితో రోజుకు 2 జీబీ డేటా 20 రోజులు వ్యాలిడిటీతో పొందవచ్చు. అయితే, దీంతోపాటు ఎరోస్ నౌ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. అలాగే, రూ. 198 ఎస్టీవీ కూడా రోజుకు 2 జీబీ డేటాను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. మరోవైపు రూ.247 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్లు, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ సర్కిళ్లలో రూ.228, రూ.268 ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చారు.