ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమర్ల హావ బాగా పెరిగింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అగ్ర సంస్థలు ఓటీటీ రంగంలో దూసుకెళ్తున్నాయి. దీంతో చాలామంది అగ్ర నిర్మాతలు, దర్శకులు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు సొంతంగా ఓటిటి చానెల్స్ ఏర్పటు చేయగా..అగ్ర హీరోలు సైతం ఇదే బాటలో ఉన్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర వెబ్ సిరీస్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారని , ఆ వెబ్ సిరీస్ ఏభై ఏళ్ల ముసలోడితో ప్రేమలో పడిన పాతికేళ్ళ అమ్మాయి ప్రేమకథ అని , ఏభై ఏళ్ల పాత్రలో బ్రహ్మాజీ కనిపించబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం కావడం తో దీనిపై బ్రహ్మాజీ స్పందించారు.
బ్రహ్మాజీ.. వెంటనే రియాక్ట్ అవుతూ నేరుగా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ని ప్రశ్నించారు. ‘‘రాహుల్ బ్రో.. ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఆ యంగ్ హీరోయిన్ ఎవరు?’’ అంటూ అడిగాడు. దీంతో బ్రహ్మాజీకి రిప్లై ఇస్తూ సదరు రూమర్ పుట్టించిన గాసిప్ రాయుళ్లకు దిమ్మతిరిగే కామెంట్ చేశారు రాహుల్ రవీంద్రన్. ”హ.. హ.. వాళ్లకేం ఏదైనా రాసేస్తారు. కనీసం చెక్ కూడా చెయ్యరు. నా దగ్గరైతే స్క్రిప్ట్ లేదు. వాళ్ళే ఆ స్క్రిప్ట్ కూడా రాసేస్తే సూపర్‌గా ఉంటుంది” అన్నారు. దీంతో వీళ్లిద్దరి ఈ సంభాషణ సోషల్ మీడియాలో నెటిజన్లు అమితంగా ఆకర్షిస్తోంది.