నవ్వుల రారాజు బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ తో కోట్లమందిని నవ్వులు తెప్పించిన ఈయన..ప్రస్తుతం సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించాడు. ఈ క్రమంలో తన రెండో కుమారుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యింది. బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌతమ్ .. 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఇచ్చారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుచిత్ర చంద్రబోస్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యిందే తప్ప.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది.
ఆ తరువాత లాంగ్ గ్యాప్ తరువాత ‘వారెవా’, ‘మను’ చిత్రాల్లో నటించాడు రాజా గౌతమ్.. ఈ సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియకుండా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో బ్రహ్మీ కొడుకు రాజా గౌతమ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు. ఇప్పుడు బ్రహ్మానందం రెండో కొడుకు సిద్దార్థ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడనే వార్త వైరల్ గా మారింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన సిద్ధార్థ్ ఇటీవల ఇండియాకు తిరిగిరావడంతో బ్రహ్మీ రెండో కొడుకు సిద్దార్థ్‌ని హీరోగా పరిచయం చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. మరి నిజంగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చూడాలి.