ఈ ఉలుకెందుకు?

botsaబాధితులను ఎవరు ఆదుకున్నా ఆదుకోవడమే. అక్కడ కూడా అసూయాద్వేషారలెందుకు? చార్ థామ్ బాధితులకను ఆదుకోవడంలో కేంద్ర కాంగ్రెస్ ముందుంది. ఆపై తెలుగుదేశం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి హల్ చల్ చేశారు. సహజమే. ఒక రాజకీయపార్టీ అధ్యక్షుడు ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచించారు. ముఖ్యమంత్రి తన పనుల వత్తిడి వల్ల కావచ్చు అలా చేయలేకపోయారు. ఆయన తరపున అధికారులు పనిచేస్తారు. చంద్రబాబు ప్రతిపక్షంలో వున్నారు కాబట్టి, ఆయనే వెళ్లారు. ఇలా ఆలోచించాలి కానీ, చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని, ఇంకొకటని, విమర్శలు చేయడం సరికాదు కదా? కావాలంటే సరిగ్గా సమాధానం చెప్పకోవచ్చు. తాము అధికారంలో వున్నామని, అధికారులను పంపి, ఇలా చేసామని, అలా చేసామని వాదించవచ్చు. అలా కాకుండా బొత్స, దానం తదితరులు అనవసరం ఎదురుదాడికి దిగి చంద్రబాబును మరింత హైలైట్ చేస్తున్నారు. మరి కేంద్రంలో కూడా రాహుల్ వెళ్ల లేదన్న విమర్శలు వచ్చాయి. మోడీ అక్కడకు వెళ్లారు. మోడీ శవరాజకీయాలు చేస్తున్నారని రాహుల్ అనలేదే. తానూ ఇప్పుడు బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సరిగ్గా మాట్లాడడం ఎప్పటికి నేర్చుకుంటారో?