భాజపా, సీపీఐ నేతల అరెస్ట్ !

cpi-narayanaతెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన “ఛలో అసెంబ్లీ” నేపథ్యంలో.. రాజకీయ నాయకుల అరెస్టల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే.. తెరాస ఎమ్మెల్యే, నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా, భాజపా, సీపీఐ నేతలను సైతం అదుపులోని తీసుకున్నారు. “ఛలో అసెంబ్లీ”కి బయలుదేరిన భాజపా సీనియర్ నేతలు
విద్యాసాగర్ రావు, లక్ష్మణ్ సహా పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే,  అరెస్ట్ చేసే ప్రయత్నంలో  విద్యాసాగర్ రావు చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ’ఛలో అసెంబ్లీ’కి బయలు దేరిన సీబీఐ
రాష్ట్ర కార్యదర్శి నారాయణ తో పాటుగా, ఆ పార్టీ కార్యకర్తలను లిబర్టీ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలను అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది.