అఫ్జల్ గురు ఉరిపై బీజేపీ నోటీసు

పార్లమెంటుపై ముష్కర మూకల దాడి జరిగి ఈ రోజుకి సరిగ్గా పదకొండేళ్ళు పూర్తయ్యాయి. ఈ దాడిలో పార్లమెంట్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ పై దాడి జరిపిన కేసులో ఉరిశిక్ష పడ్డ తీవ్రవాది అఫ్జల్ గురుకు ఉరి అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్సభలో ఈ అంశాన్ని చర్చించేందుకు అనుమతిని కోరుతూ స్పీకర్ మీరాకుమార్కు నోటీసులు అందజేసింది. ఇటీవలే ముంబై దాడుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది కసబ్ ను ఉరి తీసిన విషయం తెలిసిందే…అప్పటి నుండి దేశం నలుమూలల నుండి సాధారణ ప్రజలతో పాటుగా రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్న తరుణంలో బిజేపీ దీనిపై లోక్ సభలో స్పీకర్ కు సమర్పించిన నోటీసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.