తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు హీరో ప్రిన్స్ నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత బస్ స్టాప్, నేను శైలజ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ రామ్, బోయపాటి శ్రీను సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
అఖండ బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రిన్స్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. పవర్ ఫుల్ విలనిజాన్ని తెరమీద చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను కు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది.
రామ్ & బోయపాటి సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను ప్రిన్స్ కోసం బోయపాటి శ్రీను రాసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.