ఆగష్టు 30 నుంచి బిగ్ బాస్ 4 ..?

నార్త్ లో సూపర్ హిట్ అయినా బిగ్ బాస్ షో..సౌత్ లో కూడా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే మూడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో నాల్గో షో మొదలుకానుంది. రీసెంట్ గా ఈ సీజన్ కు సంబందించిన కామింగ్ సూన్ ప్రోమో కూడా రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.

ఇక ఈ సీజన్ 4కి నాగార్జున హోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఈ షో లేట్ గా మొదలైనా లేటెస్ట్ గా ఉండేలా ప్లాన్ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా ఈ షో ప్రోమో కూడా సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ సీజన్ 4 ను ఆగష్టు 30 నుంచి టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించి సన్నాహాలు ఇప్పుడు జరుగుతున్నట్టు తెలుస్తుంది.