Site icon TeluguMirchi.com

బయ్యారం ఉక్కు… గిరిజనుల హక్కు..!

NCBNరెండో దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బయ్యారం ఉక్కుపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెరలేవనుంది. గతంలో తెరాస “బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు” అని ఆందోళనలు చేపట్టింది. అయితే, తెరాస ఆందోళనలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. తదనంతరం టీడీపీ, వైకాపాలు కూడా దీనిపై స్పదించినప్పటికినీ.. తెలంగాణ అనే ట్యాగ్ లైన్ తో అన్ని పార్టీలు మనస్పూర్తిగా పోరాడలేకపోయాయి. అయితే, తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలు కలిసి వచ్చేలా “బయ్యారం ఉక్కు… గిరిజనుల హక్కు” అనే అర్థం వచ్చే విధంగా ఆందోళనలు ఉదృతం చేసే దిశగా ప్రణాళికలు తయారు చేసినట్లు కనిపిస్తోంది.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు బాబు గన్ పార్క్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజనుల పొట్టకొట్టేలా ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. గిరిజనుల అభివృద్ధి కోసం బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. అంటే మరోసారి బయ్యారంపై ఆందోళనలు మొదలయ్యాయి. మరి ఈసారైనా.. ప్రతిపక్షాలు ప్రభుత్వం మెడలు వంచి బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా విజయం సాధిస్తాయో లేదో వేచి చూడాలి.

Exit mobile version