ఈ ముగ్గురే కాపాడాలి!

sruthi-hasna-bramhanandam-lర‌వితేజ ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయాడు. ర‌వితేజ సినిమాకు ఇది వర‌కు ఉండే క్రేజ్‌… ఇప్పుడు మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. కిక్ త‌ర‌వాత క్లీన్ హిట్ లేదాయె. దొంగ‌ల ముఠాలాంటి సినిమాలు ఒప్పుకొని… ఇమేజ్ కి చేచేతులా డామేజ్ చేసుకొన్నాడు. వ‌రుస‌గా ఆరు సినిమాలు బోత్తా ప‌డ్డాయి. ఇప్పుడు ఆత‌ని చేతిలో ఉన్న ఆఖ‌రి అవ‌కాశం బ‌లుపు. ఈ సినిమాపై కూడా జ‌నాల‌కు ఎలాలంటి హోప్స్ లేవు. ఇప్పుడిప్పుడే ఈ సినిమాకి ఒక ర‌క‌మైన లుక్ వ‌స్తోంది. అది ర‌వితేజ వ‌ల్ల మాత్రం కాదు. ఈ సినిమా క్రేజ్ కి కార‌ణం.. ముగ్గురు. ఒక‌రు బ్రహ్మానందం. ఈ సినిమాలో క్రేజీ మోహ‌న్‌గా బ్రహ్మీ తెగ న‌వ్వించేస్తాడ‌ట‌. ఆయ‌న కామెడీ పై ఈ చిత్రబృందం గంపెడాశ‌లు పెంచుకొంది. ఆ త‌ర‌వాత ఈ ప్రాజెక్టులోకి ల‌క్ష్మీరాయ్ వ‌చ్చి చేరింది. ల‌క్ష్మీ ఐటెమ్ సాంగ్ చేస్తుంది అన‌గానే ఆటోమెటిగ్గా.. ఈ సినిమాకి కాస్త గ్లామ‌ర్ వ‌చ్చింది. ఇప్పుడు… శ్రుతిహాస‌న్ ఆ డోసు అమాంతం పెంచేసింది. శ్రుతి హాట్ ఫొటోలు…. యువ‌త‌కి య‌మా కిక్ ఇచ్చేస్తున్నాయి. థియేట‌ర్లో ఇంకెంత హ‌ల్‌చ‌ల్ చేస్తుందో… అని ఎదురుచూస్తున్నారు. ర‌వితేజ‌ని ఈ ముగ్గురే కాపాడాలి. వేరే ఛాయిస్ లేదు. మ‌రి.. ఈ బ‌లం స‌రిపోతుందా?  లేదా?  అనే ప్రశ్నల‌కు జూన్ 21న స‌మాధానం తెలుస్తుంది. ఎందుకంటే బ‌ల‌పు వ‌చ్చేది ఆ రోజే.