రవితేజ సినిమా బలుపు విడుదలకు ముందే వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమా టీజర్లో బ్రహ్మాణులపై సెటైర్లు వేశారనే విమర్శలు వచ్చాయి. బ్రహ్మాణ సమాజం ఈ సినిమాపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దాంతో ముందు జాగ్రత్తగా ఈ సినిమాకి బ్రహ్మాణ పెద్దలతో పాటు కొంతమంది పాత్రికేయులకు, విమర్శకులకు ప్రత్యేకంగా చూపించారట. వారి నుంచి సలహాలూ, సూచనలు కూడా తీసుకొన్నారట. విమర్శలకు కారణమైన సంభాషణలను తొలగించారట. ఈ సినిమా శనివారం సెన్సార్ ముందుకు వెళ్లింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సెన్సార్ సభ్యులు సినిమా మొత్తం చూడలేకపోయారు. సోమవారం… ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.