Site icon TeluguMirchi.com

వ‌సూళ్ల బ‌లుపు!

Balupu audioడివైడ్ టాక్ ఉన్నా బ‌లుపు బాగానే చూపిస్తున్నాడు రవితేజ. క‌థ‌లో కొత్తద‌నం లేక‌పోయినా, కామెడీ మరీ గొప్పగా లేక‌పోయినా `ర‌వితేజ గ‌త సినిమాల‌కంటే బాగుంది..` అనే టాకే ఈ సినిమాని కాపాడింది. తొలిరోజు వ‌సూళ్లు అటు ర‌వితేజ‌ను, ఇటు నిర్మాత‌లనూ సంతోష‌పెట్టాయి. శుక్రవారం, శ‌నివారం అన్ని ఏరియాల్లో క‌లిపి రూ. 6.25 కోట్లు వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ టాక్‌. నైజాంలో రెండు కోట్ల రూపాయ‌ల‌కు పైగా షేర్ సాధించింది. ఆదివారం కూడా ఈ వ‌సూళ్లు ఈ రేంజులోనే ఉండే అవ‌కాశం ఉంది. ఈ సినిమా హిట్టా? ఫ్లాపా? అనేది మాత్రం సోమ‌వారం వ‌సూళ్లే తేలుస్తాయి.

Exit mobile version