కరోనా మహమ్మారి చిత్రసీమ ప్రముఖులను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి రోజు ఎవరికో ఒకరికి ఈ కరోనా సోకుతుంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఈయన ఆరోగ్యం విషయంగా ఉందనే వార్తలు వినిపిస్తుండడం తో ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన ఆరోగ్యం ఫై డాక్టర్స్ తాజా అప్డేట్ తెలిపారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని… ఈ వైద్యు టీమ్‌లో ఇంటర్నల్ మెడిసన్, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఇన్ఫెక్టివ్ డీసీజెస్, ఎక్మోకేర్‌లో విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉన్నారని తెలిపారు. వీరంతా అంతర్జాతీయస్థాయి వైద్యులతో నిరంతరం అనుసంధానమై ఉంటున్నారని పేర్కొంది. యూకే, యూఎస్‌లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సాయంతో అక్కడి వైద్యులు చికిత్స చేశారని తెలిపింది.